మాతృ భాష పై పట్టు

Actress Tamannaah Devotes Her Lockdown Time To Gain Mastery Of Her Mother Language

2005 సంవత్సరం సక్సెస్ ఫుల్ “శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూత లూగించారు. స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్” మూవీ లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో తమన్నా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, తమిళ, హిందీ,ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే తమన్నా తన మాతృభాష “సింధీ ” ని ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ .. తన మాతృ భాష సింధీ అని, తనకు సింధీ భాష రాదని,సినిమాలతో తీరిక లేక ఆ భాషపై దృష్టి సారించలేదని, లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయినందున సింధీ భాష నేర్చుకోవాలని తన మదర్ ను ఆ భాషలో మాత్రమే మాట్లాడమని చెప్పానని, ఒక సంవత్సరంలో తన మాతృ భాష పై పట్టు సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నానని తమన్నా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 19 =