వెంకటేష్ ‘ప్రేమించుకుందాం… రా!’కు 23 ఏళ్ళు

Victory Venkatesh Romantic Action Entertainer Preminchukundam Raa Completes 23 Years

తెలుగునాట అగ్రకథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్‌, టాలెంటెడ్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఆ చిత్రాలే ‘ప్రేమించుకుందాం… రా!’, ‘ప్రేమంటే ఇదేరా’.

వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మొద‌టి సినిమా ‘ప్రేమించుకుందాం… రా!’ విషయానికొస్తే.. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాతోనే తెలుగునాట ఫ్యాక్షన్ మూవీస్ ట్రెండ్ మొదలైంది. కాగా.. ఈ చిత్రంతో జయంత్ దర్శకుడిగా తొలి అడుగులు వేయగా, అంజలా ఝవేరి కథానాయికగా పరిచయం కావడం విశేషం. చంద్రమోహన్, శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి, ‘ఆహుతి’ ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘునాథరెడ్డి, వేణుమాధవ్, ఉత్తేజ్, అన్నపూర్ణ, సుధ, రమాప్రభ, జీవా, మాస్టర్ ఆనంద వర్ధన్, బేబీ నిహారిక ముఖ్య భూమికలు పోషించారు. డి.రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, భువనచంద్ర గీతరచనకు “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ, మహేష్ మహదేవన్ సంయుక్తంగా స్వరాలు సమకూర్చారు. “పెళ్లి కళ వచ్చేసిందే బాలా”, “మేఘాలే తాకింది”, “ఓ పనైపోతుంది బాబు” వంటి పాటలకు మణి బాణీలు అందించగా.. మహేష్ స్వరకల్పనలో “సూర్యకిరీటమే”, “చిన్ని చిన్ని గుండెలో”, “అలా చూడు ప్రేమలోకం” గీతాలు రూపొందాయి. ఆల్బమ్‌లోని ఆరు పాటలు అప్పట్లో సంచలనం సృష్టించడం విశేషం. 1997 మే 9న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ప్రేమించుకుందాం… రా!’.. నేటితో 23 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here