భారీ రేటుకు ‘కె.జి.ఎఫ్2’ డిజిటల్ రైట్స్

KGF 2 Digital Rights Sold For A Whopping Price
KGF 2 Digital Rights Sold For A Whopping Price

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదే జోష్ తో కె.జి.ఎఫ్‌ సీక్వెల్ కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 2 ను కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక చాప్టర్1 సూపర్ సక్సెస్ కావడంతో చాప్టర్ 2 కు కూడా భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు 18 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు ఈ వార్త టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. కన్నడ చిత్రం డిజిటల్ హక్కులు ఈ స్థాయి రేటుకు దక్కించుకోవడం గొప్పగా చెప్పుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =