కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్‌లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.ఇప్పుడు ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి రోజుకో ఫొటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా చూస్తుండగానే కాజల్ వివాహం జరిగి అప్పుడే ఒక నెల గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ జంట వన్‌మంత్ యానివర్సిరీని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గౌతమ్ కిచ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఒక నెల గడిచింది..కానీ జీవితాంతం ఇలాంటివి ఇంకెన్నో జరుపుకోవాలంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి వేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram
ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు భారతీయుడు 2, మోసగాళ్లు ముంబై సాగా అనే సినిమాలు కూడా చేస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. ప్రస్తుతం కాజల్ హానీ మూన్ లో ఉంది కాబట్టి అక్కడినుండి వచ్చిన తర్వాత డిసెంబర్ నుండి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































