సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. సూర్య మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాపై సెలబ్రిటీస్ పై కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా ఆ జాబితాలో చేరిపోయింది.
ఇక తాజాగా మాల్దీవ్స్ నుండి వచ్చిన కాస్త తీరిక దొరకడంతో సినిమాలు చూడటం స్టార్ట్ చేసినట్టుంది. ఈ నేపథ్యంలోనే ఆకాశం నీ హద్దురా సినిమాపై ప్రశంసలు కురిపించింది. ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా).. అని తెలుపుతూ.. హీరో సూర్య, హీరోయిన్ అపర్ణా బాలమురళీ నటనకు అలాగే సుధాకొంగర డైరెక్షన్‌కు ఫిదా అయినట్లుగా సమంత తెలిపింది. అలాగే ఈ సినిమాను విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్‌ను కూడా అభినందించింది. ఇటువంటి స్ఫూర్తిదాయక చిత్రం కోసమే వేచిచూస్తున్నానని సమంత తన ట్వీట్‌లో పేర్కొంది. ఇక సమంత ట్వీట్‌ను హీరోయిన్ అపర్ణా బాలమురళీ రీట్వీట్ చేసి సమంతకు థ్యాంక్స్ చెప్పింది.
Means a lot ❤️❤️
Thank you so much 🤗 https://t.co/T0l8vxcXWQ— Aparna Balamurali (@Aparnabala2) December 1, 2020
ఇక వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఫుల్ బిజీగా ఉంది సమంత. వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, బిజినెస్.. ఇలా పలు రంగాల్లో రాణిస్తోంది.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.