రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ గురించి చెప్పేదేముంది. ఒక్క సినిమా కోసం దాదాపు 5ఏళ్ళు మరే సినిమా చేయకుండా.. ఈ సినిమా కోసమే తన డేట్స్ ఇచ్చాడంటే ప్రభాస్ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ప్రభాస్ స్థానంలో మరొక హీరో ఉంటే ఇంత ధైర్యం చేసుండేవాళ్లు కాదేమో. అయితే ఫైనల్ గా తన నమ్మకానికి తగిన ఫలితమే దక్కింది. ప్రాంతీయ స్థాయి నుండి.. జాతీయ స్థాయి దాటి ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయిన రాజమౌళిని ప్రభాస్ తో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారంటూ అభిమానులు కొందరు రాజమౌళిని అడిగగా దానికి ఆయన… వామ్మో.. మళ్లీ ప్రభాస్ తో సినిమానా.. ఇప్పటికే చాలా టైమ్ గడిపాను.. బాహుబలి కోసమే ఐదేళ్లు కలిసున్నాం.. ఇంక చాలు అంటూ నవ్వేసాడు. ప్రభాస్‌తో ఇప్పటికే చాలా చేసాను. మిగిలిన వాళ్లను చూసుకుందాం ఇప్పుడు అనేసాడు జక్కన్న. మరి రాజమౌళి మాటలు వింటుంటే ఇప్పడిప్పుడే ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాలు లేనట్టే కనిపిస్తుంది.
కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదలు పెట్టి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: