కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్

కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్

KGF Movie Producer To Announce His New Film Shortly

కె.జి.య‌ఫ్ చాప్టర్ 1’ ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ఇప్పుడు ఇదే సీక్వెల్ లో ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’ సినిమా కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై కూడా ఎలాంటి అంచ‌నాలున్నాయో తెలుసు. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమాను కూడా అలాగే రూపొందిస్తున్నారు. కరోనా వల్ల షూట్ కు కొన్ని నెలలుగా బ్రేక్ పడగా గత నెలలోనే మళ్లీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. దాదాపు చివరిదశకు చేరుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే బ్యాన‌ర్‌లో మూడో పాన్ ఇండియా సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు కె.జి.యఫ్ నిర్మాత. భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రూపొంద‌నున్న ఈ సినిమా టైటిల్‌, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను డిసెంబ‌ర్ 2న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల 9 నిమిషాల‌కు తెలియ‌జేస్తాం’’ అని అధికారికంగా ప్రకటించారు.

కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో...ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్