తెలుగు , కన్నడ భాషల మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2020 సంవత్సరం లో రష్మిక కథానాయికగా నటించిన “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇన్ స్టాగ్రామ్ లో 11.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న రష్మిక ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే రష్మిక తన వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. అభిమానులతో వర్కౌట్ గురించి అందరికీ మోటివేషన్ అవసరమా , తన వర్కౌట్ వీడియో నుండి నేర్చుకోండి అంటూ తన లేటెస్ట్ వర్కౌట్ వీడియో ను రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























