సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. మహేష్, నమ్రత సోషల్ మీడియా లో యాక్టీవ్ అన్న సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరుచూ పోస్ట్ చేస్తుంటారు. అంతే కాదు మహేష్, నమ్రత లాగ సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు మహేష్, నమ్రత, అన్నయ గౌతమ్ గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మహేష్ కు సంబంధించి మరో చిన్న వీడియోనుసితార తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. సితార కెమెరాకు చిక్కకుండా మహేష్ తన ముఖం కనపడకుండా తన చేతులను అడ్డుగా పెట్టుకుని, ముఖాన్ని బెడ్ వైపునకు తిప్పాడు.‘నాన్నా.. నా కెమెరా నుంచి నువ్వు తప్పించుకోలేవు’ అంటూ సితార ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: