బిగ్ బాస్ 4 – బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన అరియానా

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, bigg boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Day 87, Bigg Boss 4 Telugu Day 87 Highlights, Bigg Boss 4 Telugu Highlights, Bigg Boss 4 Telugu Nominations, Bigg Boss 4 Telugu Nominations List, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu 4 Highlights, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Latest News, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బిగ్ బాస్ 4 – ‘రేస్ టు ఫినాలే’ టాస్క్ మొదటి లెవెల్ అయిపోగా రెండో లెవల్ కి అభిజిత్, హారిక, సోహెల్ ఇంకా అఖిల్ మిగిలారు. మరి వారికోసం బిగ్ బాస్ రెండో లెవెల్ లో ఏం గేమ్ ప్లాన్ చేసాడు.. ఎవరు మూడో లెవెల్ కి వెళ్లారు అన్నది తెలియాలంటే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్న ఎపిసోడ్ నుండే మోనాల్ అవినాష్ ను తన్నిందన్న పంచాయితీనే ఎక్కువగా సాగింది. అవినాష్ ఛాన్స్ దొరికినప్పుడల్లా మోనాల్ ను నన్ను తన్నింది అంటూ అందరికీ చెప్పే ప్రయత్నం చేసాడు. అయితే మోనాల్‌ను అడిగితే త‌న్న‌లేద‌ని చెప్పింద‌ని సోహైల్ క్లారిటీ ఇవ్వ‌గా అభి మాత్రం ఆమె అబ‌ద్ధాలు ఆడుతుంద‌ని, అందుకే ఆమె ఫ్రెండ్‌షిప్ వ‌ద్ద‌న్నాను అని చెప్పుకొచ్చాడు. ఒక‌వేళ మోనాల్‌ నిజంగా త‌న్నితే మాత్రం ఆమెతో మాట్లాడ‌ను అని సోహైల్ చెప్పాడు. ఇకఇదే విషయం సోహెల్ మోనాల్ ను అడగగా.. అన్ని సార్లు ఒకే టాపిక్ గురించి మాట్లాడుతుండటంతో కొంచం కన్ఫ్యూజ్ అయిన మోనాల్ ఒకవేళ తన్నుంటానేమో అని చెప్పి అవినాష్ కు సారీ చెప్పింది.

ఇక ఆ త‌ర్వాత‌ ఫినాలే రేసులో రెండో లెవ‌ల్ ప్రారంభ‌మైంది. ఇందులో పై నుంచి ప‌డే పూల‌ను సేక‌రించి మ‌ట్టిలో నాటాలి. ఎక్కువ పూలు నాటిన ఇద్ద‌రు త‌ర్వాతి లెవ‌ల్‌కు అర్హ‌త సాధిస్తారు. ఇక టాస్క్‌లో అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, హారిక ఎవ‌రికి వారు బాగానే ఆడారు. ఇక ఇక్కడే హారిక.. సోహైల్ మధ్య చిన్న వివాదం కూడా జరిగింది. సోహెల్ చేతిలోనుంచి పువ్వు లాక్కోవ‌డంతో సోహెల్ కూడా ఆమె దగ్గర పువ్వుల‌న్నింటినీ లాక్కోవ‌డం ప్రారంభించాడు. త‌ర్వాత ఇది గొడ‌వ‌గా మారింది. ఫైనల్ గా సోహైల్ హారిక కు తాను తీసుకున్న పూలను ఇచ్చాడు. అయితే తక్కువ పూలు నాటడంతో హారిక ఆ గేమ్ నుండి తప్పుకోవాల్సివచ్చింది.

 ఇక మరోపక్క బిగ్ బాస్ ఇది వ్యక్తిగతంగా ఆడాలి అని చెప్పడంతో అరియానా బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చింది. నిన్న వ్య‌క్తిగ‌తంగా ఆడి ఓడిపోయాను. మీరు న‌న్ను ఇప్ప‌టికిప్పుడు పంపించేసినా నేను అస్స‌లు లెక్క చేయ‌ను, కానీ మీరు చేస్తోంది మాత్రం త‌ప్పు..‌ అని అరియానా బిగ్‌బాస్ మీద మండిప‌డింది. అఖిల్‌, సోహైల్ క‌లిసి ఆడి టాప్‌ 5లోకి వెళ్లిపోదామ‌నుకుంటున్నారు అని అసహనం వ్యక్తం చేసింది.

ఆ తర్వాత అభి, సోహెల్, అఖిల్ మధ్య ఈ టాస్క్ జరుగగా.. ఈ రౌండ్ లో అభి తక్కవ పూలు నాటడంతో అతను కూడా గేమ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీనితో ఫైనల్ స్టేజ్ కు ఫ్రెండ్స్ అఖిల్, సోహెల్ వెళ్లారు.

గేమ్ అయపోయిన తర్వాత ఇంటి ప‌నులు చేయాల్సిన విష‌యంలో అవినాష్‌, అరియానా గొడ‌వ ప‌డ్డారు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేద‌ని న‌న్ను ఎందుకు అన్నావు? అని అవినాష్ ప్ర‌శ్నించ‌డంతో ఆమె సారీ, క్ష‌మించు అంటూ దండం పెట్టేసింది. నేను నామినేష‌న్‌లో ఉన్నాను, నువ్వు అలా మాట్లాడొద్దు, ఇలా బిహేవ్ చేయొద్దంటూ అవినాష్ సీరియ‌స్ అవ‌డంతో అభి అత‌డికి న‌చ్చ‌జెప్పాడు. అటు అరియానా బాధ‌తో ఏడుస్తుంటే కూడా ఇది కూడా కాలిక్యులేట్ అవుతుంద‌ని లెక్క‌లు వేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన అరియానా నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా? అని మండిప‌డింది. కాసేప‌టికే ఒంట‌రిగా బాధ‌ప‌డుతున్న అరియానా ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఓదార్చాడు.

ఇక ఈ రోజు మూడో లెవల్ జరగబోతుంది. ఒక ఉయ్యాల ఇచ్చి అందులో కూర్చోవాలి. ఎవరు ముందు లేస్తే వాళ్ళు గేమ్ ఓడిపోయినట్టు.. మరి చూద్దాం వీరిద్దరిలో డైరెక్ట్ గా టాప్ 5 కి ఎవరు వెళ్తారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 19 =