
ట్యాగ్ · 4140 కథనాలు


నా జీవితంపై నాకు క్లారిటీ ఉంది..!

నాగశౌర్య స్టన్నింగ్ లుక్
‘లూసీఫర్’ రీమేక్ కు ముహూర్తం ఖరారు..?

"మేడే " మూవీ సెట్స్ లో రకుల్
‘గాడ్సే’గా సత్యదేవ్
'కె.జి.యఫ్ 2' టీజర్ టైం ఫిక్స్ - కౌంట్ డౌన్ స్టార్ట్
రష్మిక డ్రీమ్ రోల్స్
పొంగల్ రేస్ - అడ్వాన్స్ బుకింగ్స్
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?
సిమ్లా లో కొత్త జంట
'చెక్' ఫస్ట్ గ్లింప్స్ - ఖైదీ చదరంగం

థియేటర్ లోకి 'డర్టీ హరి'
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'

2021 సంవత్సరంలో శృతిహాసన్ సినిమాల సందడి

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య
స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తూ కీర్తి సురేష్

ఏజీఎస్ సినిమాస్ చేతికి ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో షూర్ షాట్ హిట్ అనే టాక్ వినపడుతుంది. ఇక ఈసినిమాను తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ విడుదలచేస్తుంది. దాంతో ఉస్తాద్ కు అక్కడ కూడా గ్రాండ్ రెలీజ్ కానుంది.

నా జీవితంపై నాకు క్లారిటీ ఉంది..!
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. కొన్నేళ్లుగా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సునీత ఇక ఇటీవలే రెండో వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ కంపెనీ అధినేత రామ్ వీరపనేని ని వివాహమాడారు. ఇక ఇప్పుడు అటు ప్రొఫెషనల్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన వివాహం, వృత్తి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేసింది.

నాగశౌర్య స్టన్నింగ్ లుక్
యంగ్ హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్వంత బ్యానర్ తో పాటు ఇతర బ్యానర్స్ లోనూ నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని క్యారెక్టర్ కై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ సాధించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా “వరుడు కావలెను “మూవీ తెరకెక్కుతుంది. ఈ రెండు మూవీస్ షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి.
పోస్టర్స్ తో క్యూరియాసిటీ పెంచుతున్న 'కె.జి.యఫ్2' టీం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కె.జి.యఫ్ 2 కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమానుండి టీజర్ ను యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఇక ఈ నేపథ్యంలో టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ నిన్న యష్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఈ రోజు మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. 3 డేస్ టు గో అంటూ మొహం కనిపించని ఒక క్యారెక్టర్ పోస్టర్ ను పోస్ట్ చేసి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.
‘లూసీఫర్’ రీమేక్ కు ముహూర్తం ఖరారు..?
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నా ఇటీవలే ఈ రీమేక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చింది. తమిళ ఇండస్ట్రీలో రీమేక్ స్పెషలిస్టుగా పేరుగాంచిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

"మేడే " మూవీ సెట్స్ లో రకుల్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రస్తుతం 2హిందీ , 2 తమిళ , 2 తెలుగు మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మరో బాలీవుడ్ మూవీ లో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన రకుల్ కరోనా నుండి కోలుకుని తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
‘గాడ్సే’గా సత్యదేవ్
‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్... పూరీ జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు. ఇప్పుడు మరో కథతో రావడానికి రెడీ అయ్యాడు.
'కె.జి.యఫ్ 2' టీజర్ టైం ఫిక్స్ - కౌంట్ డౌన్ స్టార్ట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ కూడా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ తో వచ్చేసారు కె.జి.యఫ్ 2 టీమ్. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను జనవరి 8వ తేదీన ఉదయం 10గంటల 18 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఇటీవలే ట్విట్టర్ ద్వారా ప్రత్యేకమైన పోస్టర్ పోస్ట్ చేస్తూ తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేసి మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రయూనిట్.
ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబినేషన్ లో మూడో సినిమా
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో 2018లో సమ్మోహనం అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి కూడా విదితమే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. వీరి కాంబోలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు.
రష్మిక డ్రీమ్ రోల్స్
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక కోలీవుడ్ , బాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "మిషన్ మజ్ను" మూవీ తో బాలీవుడ్ కు రష్మిక ఎంటర్ అవుతున్నారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
పొంగల్ రేస్ - అడ్వాన్స్ బుకింగ్స్
మళ్లీ పొంగల్ రేస్ మొదలైంది. ప్రతి సమత్సరం లాగానే ఈ ఏడాది కూడా సాంక్రాంతి బరిలోకి దిగేందుకు హీరోలు సిద్ధమయ్యారు. గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, రజినీ దర్బార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఆ రేంజ్ లో థియేటర్స్ లో సందడి చేసిన అవకాశం లేకుండా పోయింది. కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు థియేటర్ ల మొహం చూడలేదు. ఇక క్రిస్మస్ కు రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి సాలిడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఒక రకంగా ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. కేవలం 50% ఆక్యూపెన్సీ ఉన్నాకానీ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది.
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు,భూమిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఒక్కడు "మూవీ ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 8 నందిఅవార్డ్స్ ,4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న"ఒక్కడు" మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన "ఒక్కడు" మూవీ కై భారీ వ్యయం తో చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సిమ్లా లో కొత్త జంట
టాలీవుడ్ ,కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సినామికా" (తమిళ ), "ముంబై సాగ"(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక ఫాంటసీ హారర్ కామెడీ తమిళ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'చెక్' ఫస్ట్ గ్లింప్స్ - ఖైదీ చదరంగం
నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా కొత్త అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

థియేటర్ లోకి 'డర్టీ హరి'
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డర్టీ హరి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీల రిలీజ్ అయింది. నిజానికి ఈసినిమా ట్రైలర్స్ చూసి ఇందులో అడల్ట్ కంటెంట్ ఉంటుందేమో.. ప్రేక్షకులను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నారు కానీ.. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో మంచి టాక్ తో దూసుకుపోతుంది. మొదట స్ట్రీమింగ్ పెట్టగా మంచి వ్యూవ్స్ రావడంతో.. ఆ తర్వాత ఆహా లో రిలీజ్ చేశారు. ఇక ఏటీటీ, ఓటీటీలలో వచ్చిన స్పందన చూసిన దర్శకనిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'
మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘క్రాక్’ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోగా నిలవడమే గాక రవితేజ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోడమే కాదు 2 లక్షల మేర లైక్స్ ను సొంతం చేసుకుంది.

"యుగానికి ఒక్కడు 2" మూవీ పోస్టర్ రిలీజ్
సూపర్ హిట్ "7/G బృందావన కాలని ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే "మూవీస్ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా డ్రీమ్ వ్యాలీ బ్యానర్ పై రూపొందిన "ఆయిరిత్తిల్ ఒరువన్ "(యుగానికి ఒక్కడు )తమిళ మూవీ 2010 సంవత్సరంలో రిలీజ్ అయ్యి విజయం సాధించింది. చోళ డైనాస్టీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు సెల్వ రాఘవన్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్రాఫిక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.

2021 సంవత్సరంలో శృతిహాసన్ సినిమాల సందడి
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి కథానాయికగా రూపొందిన 2 తెలుగు , ఒక తమిళ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటో షూట్స్ లో పాల్గొన్న తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 3 సంవత్సరాల తరువాత శృతి హాసన్ 2021 సంవత్సరంలో 3 సినిమాలతో సందడి చేయనున్నారు.

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య
కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఓటీటీ లో రిలీజ్ అయిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. రీసెట్ గా గువ్వ గోరింక అనే సినిమాను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.
స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తూ కీర్తి సురేష్
బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల మూవీస్ తో కీర్తి బిజీగా ఉన్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో కీర్తి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి ప్రస్తుతం నితిన్ "రంగ్ దే !", రజనీకాంత్ "అన్నాత్తే ", మోహన్ లాల్ "మరక్కార్ " మూవీస్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు "సర్కారు వారి పాట " మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు.