‘చెక్’ ఫస్ట్ గ్లింప్స్ – ఖైదీ చదరంగం

Actor Nithiin Latest Movie Check First Glimpse is Out,Check Telugu Movie First Glimpse,Check Movie,Check Movie Teaser,Check Teaser,Check Movie First Glimpse,Nithiin Check Teaser,Nithiin Check Movie,Nithiin,Rakul Preet Singh,Priya Prakash Varier,Chandra Sekhar Yeleti,Bhavya Creations,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin First Look,Check Movie First Look,Check Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Nithiin

నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా కొత్త అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ గ్లింప్స్ వీడియో ను చూస్తుంటే నితిన్ మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడని మాత్రం అర్ధమవుతుంది. ‘జైలులో ఆదిత్య అనే ఖైదీ చెస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు’ అనే వాయిస్‌ ఓవర్‌తో ఈ వీడియో ఆరంభమైంది. నితిన్ ఆదిత్య అనే పాత్రలో ఒక ఖైదీగా నటిస్తున్నాడు. జైల్లో పోలీస్‌ అధికారులు అతన్ని దేశద్రోహి, తీవ్రవాది అని దూషిస్తుంటారు. మరో పక్క రకుల్ లాయర్ పాత్రలో నటిస్తూ ‘హీ ఈజ్‌ ఇన్నోసెంట్‌’ అంటూ నితిన్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధమవుతుంది. 40 సెకెన్ల నిడివిలో సింపుల్‌గా కథాంశం చెప్పే ప్రయత్నం చేసాడు చంద్రశేఖర్‌ యేలేటి. మొత్తానికి ఈ చిన్న వీడియోతో సినిమాపై మంచి ఆసక్తినే కలిగించారు. సినిమాపై అంచనాలు కూడా పెంచేశారు.

కాగా భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కల్యాణిమాలిక్‌ ఈ సినిమాకు సంగీతం అందించగా..సినిమాటోగ్రఫీ రాహుల్‌ శ్రీవాత్సవ్‌ అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eleven =