‘గాడ్సే’గా సత్యదేవ్

Versatile Actor Satyadev Now Comes Back As Godse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Satyadev And Director Gopi Ganesh Pattabhi Team Up For Godse,Godse,Godse Title Poster,Godse Movie,Godse Film,Actor Satyadev,Godse Title Poster Out,Satya Dev Godse Title Poster,Godse Movie Title Poster,Satya Dev New Movie Poster,Actor Satyadev Now Comes Back As Godse,#Godse

‌‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్‌… పూరీ జగన్నాథ్‌ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు. ఇప్పుడు మరో కథతో రావడానికి రెడీ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి ‘బ్లఫ్‌ మాస్టర్‌’ డైరెక్టర్ తోనే సినిమా ఫిక్స్ చేసాడు. దర్శకుడు గోపీ గణేష్‌.. మరోసారి సత్యదేవ్‌తో సరికొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘గాడ్సే’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. సీరియస్ లుక్, గన్స్ బ్యాక్ గ్రవుండ్, గాడ్సే టైటిల్ అన్నీ చూస్తుంటే.. సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.

ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =