‘కె.జి.యఫ్ 2’ టీజర్ టైం ఫిక్స్ – కౌంట్ డౌన్ స్టార్ట్

Countdown For KGF 2 Teaser Kickstarts As KGF Movie Team Announces Teaser Date and Time,KGF2,KGF Actor Yash,KGF Chapter 2,Hero Yash,Sanjay Dutt,Actress Srinidhi Shetty,KGF Chapter 2 Latest News,KGF Chapter 2 Latest Update,Latest Telugu Movies News,Telugu Film News 2020,Telugu Filmnagar,Tollywood Movie Updates,KGF 2,KGF 2 Movie Teaser,KGF 2 Film Teaser,KGF Chapter 2 Movie Teaser,KGF 2 Teaser,Director Prashanth Neel,#KGFChapter2,Countdown For KGF 2 Teaser,KGF: Chapter 2 Will Be Released On January 8 At 10:18am,KGF 2 Teaser On Yash Birthday

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ కూడా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ తో వచ్చేసారు కె.జి.యఫ్ 2 టీమ్. ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను జనవరి 8వ తేదీన ఉదయం 10గంటల 18 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఇటీవలే ట్విట్టర్ ద్వారా ప్రత్యేకమైన పోస్టర్ పోస్ట్ చేస్తూ తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేసి మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడంతో.. ఇక అన్ని పనులు త్వరలోనే పూర్తి చేసి వీలైనంత తొందరలో సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 9 =