పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో షూర్ షాట్ హిట్ అనే టాక్ వినపడుతుంది. ఇక ఈసినిమాను తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ విడుదలచేస్తుంది. దాంతో ఉస్తాద్ కు అక్కడ కూడా గ్రాండ్ రెలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతాన్ని అందించారు.
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివి 2 గంటల 33 నిమిషాల 49 సెకన్లుగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించగా తమిళ నటుడు పార్తిబన్ విలన్‌గా కనిపించనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























