కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య

latest telugu movie trailers, latest telugu movies news, Latest Tollywood News, Satyadev, Satyadev Bids Adieu, Satyadev Bids Adieu To 2020, Satyadev Bids Adieu To 2020 With THIS Memorable Moment Of Chiranjeevi, Satyadev Movies, Satyadev Upcoming Movi

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య

Satyadev Shares An Adorable Pic With Chiranjeevi

latest telugu movie trailers, latest telugu movies news, Latest Tollywood News, Satyadev, Satyadev Bids Adieu, Satyadev Bids Adieu To 2020, Satyadev Bids Adieu To 2020 With THIS Memorable Moment Of Chiranjeevi, Satyadev Movies, Satyadev Upcoming Movi

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఓటీటీ లో రిలీజ్ అయిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. రీసెట్ గా గువ్వ గోరింక అనే సినిమాను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

ఇక తాజాగా చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన సత్యదేవ్.. `ఈ ఫొటోను షేర్ చెయ్యకుండా ఈ ఏడాదికి ఎలా గుడ్ బై చెప్పగలను... ధన్యవాదాలు అన్నయ్య` అని ట్వీట్ చేసాడు. కాగా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య` విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సత్యదేవ్ కలిసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాతో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్