యంగ్ హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్వంత బ్యానర్ తో పాటు ఇతర బ్యానర్స్ లోనూ నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని క్యారెక్టర్ కై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ సాధించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా “వరుడు కావలెను “మూవీ తెరకెక్కుతుంది. ఈ రెండు మూవీస్ షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి “, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె పి రాజేంద్ర దర్శకత్వంలో “పోలీసు వారి హెచ్చరిక” మూవీస్ కు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీలో నాగశౌర్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. నాగశౌర్య సిక్స్ ప్యాక్ తో తన శరీరాకృతిని మార్చేశారు. నాగశౌర్య తన స్టన్నింగ్ లుక్ ను మొబైల్ కెమెరాలో బంధించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. రాబోయే సినిమాలలో హీరో నాగశౌర్య తన సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: