పొంగల్ రేస్ – అడ్వాన్స్ బుకింగ్స్

Hyderabad Theatres Open Advance Booking System For Sankranthi Movies,Hyderabad Movie Tickets Online Booking,Movies in Hyderabad,Online Movie Ticket Booking,Movie Tickets Online Booking in hyderabad,Hyderabad Theatres,Hyderabad,Hyderabad Theatres Open Advance Booking System,Sankranthi,Sankranthi Movies,Advance Booking For Sankranthi Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Hyderabad Theatres Advance Booking

మళ్లీ పొంగల్ రేస్ మొదలైంది. ప్రతి సమత్సరం లాగానే ఈ ఏడాది కూడా సాంక్రాంతి బరిలోకి దిగేందుకు హీరోలు సిద్ధమయ్యారు. గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, రజినీ దర్బార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఆ రేంజ్ లో థియేటర్స్ లో సందడి చేసిన అవకాశం లేకుండా పోయింది. కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు థియేటర్ ల మొహం చూడలేదు. ఇక క్రిస్మస్ కు రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి సాలిడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఒక రకంగా ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. కేవలం 50% ఆక్యూపెన్సీ ఉన్నాకానీ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదే జోష్ తో సంక్రాంతి రేస్ కూడా మొదలవుతుంది. చాలా సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పెద్ద సినిమాలు.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు అంటే.. క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు. క్రాక్ సినిమా జనవరి 9న రిలీజ్ అవుతుండగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనితో సినిమా పక్కా హిట్ అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

ఇక మాస్టర్ సినిమా జనవరి 13న విడుదలవుతుంది. ఈ సినిమాపై కూడాభారీ అంచనాలు ఉన్నాయి. తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమా జనవరి 14న రాబోతుంది ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అల్లుడు అదుర్స్ సినిమా జనవరి 15న రిలీజ్ కానున్నాయి. ఇక ఈ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇన్నిరోజులు అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఇప్పుడు అవి కూడా ఓపెన్ చేయడంతో చాలా భారీగా బుకింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =