ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు`. ఈ చిత్రం ద్వారా కమెడియన్, నటుడు శ్రీనివాస్ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 6న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
కాగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. `జయమ్ము నిశ్చయమ్మురా` రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లేను అందించారు.ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు తన కామెడీతో.. మరోవైపు హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నాడు. చూద్దాం మరి డైరెక్టర్ గా ఎంత వరకూ సక్సెస్ అవుతాడో.. లేదో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: