ఉదయ్ కిరణ్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో..!

Young Hero Gives Clarity On Uday Kiran Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Uday Kiran Biopic Movie Updates,Uday Kiran Biopic Telugu Movie Latest News,Uday Kiran Biopic Latest News,Uday Kiran Biopic Live Updates

‘చిత్రం’, నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలను చవి చూసి.. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించాడు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. అలా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఈ హీరో కెరీర్, లైఫ్‌ ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయింది. ఇక ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కించగా.. ఇంకా కొంత మంది బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో దివికేగిన ఉదయకిరణ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఓ యంగ్ హీరో ఈ బయోపిక్ చేయడానికి సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్తలు కూడా జోరుగా వినిపించాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై స్పందించిన సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. తాను ఏ బయోపిక్ లో నటించట్లేదని.. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ బయోపిక్ నిజంగానే వస్తోందా..? లేక కేవలం ప్రకటన వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి.

కాగా ప్రస్తుతం సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. ఇటీవలే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. డెన్నిస్ జీవ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − one =