దర్శకుడు సుకుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు -అల్లుఅర్జున్

Stylish Star Allu Arjun Sends Out His Warm Wishes To Director Sukumar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Mamangam Movie Updates,Stylish Star Allu Arjun Latest News,Stylish Star Allu Arjun About Sukumar,Allu Arjun Emotional Towards Director Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “ఆర్య “మూవీ 2004 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ అల్లు అర్జున్ జీవితాన్నే మార్చేసింది. “ఆర్య” మూవీ కి సీక్వెల్ గా “ఆర్య2” మూవీ రూపొంది 2009 సంవత్సరం నవంబర్ 27 వ తేదీ రిలీజ్ అయ్యింది. ఈ రోజు తో “ఆర్య2” మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్య “, “ఆర్య2” మూవీస్ రూపొందించిన దర్శకుడు సుకుమార్ కి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలియజేస్తూ ‘ నా ఊపిరి ఆగిపోయినా .. ‘ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ట్వీట్ చేశారు. ‘ఉప్పెనంత ప్రేమకి .. గుప్పెడంత గుండె ఏమిటో ‘అని రాసి మీరు చూపించిన ప్రేమ కు తన హృదయం సరిపోవడం లేదని , “ఆర్య 2 మూవీ” జర్నీ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని అర్జున్ ట్వీట్ చేశారు .త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురములో ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో మరో మూవీ    రూపొందనుంది.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 4 =