క్రేజీ హీరోయిన్స్ రీ-ఎంట్రీకి కేరాఫ్ అడ్ర‌స్ గా మాస్ మ‌హారాజా

Mass Maharaja Becomes Re-Entry Special Hero For Heroines,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Ravi Teja Upcoming Movie News,Ravi Teja Next Film Updates,Ravi Teja New Movie Details,Ravi Teja Upcoming Film Updates,Mass Maharaja Ravi Teja Next Project Details

`కాట‌మ‌రాయుడు` (2017) త‌రువాత టాలీవుడ్ కి దూర‌మైన శ్రుతి హాస‌న్… మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్`తో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. `బ‌లుపు` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత త‌న ల‌క్కీ హీరో (ర‌వితేజ‌) కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో… శ్రుతి ఈ కాప్ స్టోరీపై భారీ ఆశ‌లే పెట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… శ్రుతి కంటే ముందు మ‌రో ముగ్గురు నాయిక‌లు ర‌వితేజ సినిమాల‌తో తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చిన వైనం ఉంది. ఆ వివ‌రాల్లోకి వెళితే… `హ‌నుమాన్ జంక్ష‌న్` త‌రువాత టాలీవుడ్ కి దూర‌మైన స్నేహ‌… ర‌వితేజ `వెంకీ`తోనే రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఘ‌న‌విజ‌యంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక `భ‌గీర‌థ‌` త‌రువాత అన్య‌భాషా చిత్రాల‌తో బిజీ అయిపోయిన శ్రియ‌… టాలీవుడ్ లో మ‌ళ్ళీ ర‌వితేజ న‌టించిన `డాన్ శీను`లోనే పూర్తిస్థాయి క‌థానాయిక‌గా క‌నువిందు చేసింది. మ‌రో విజ‌యాన్ని ఒడిసిప‌ట్టుకుంది. అలాగే, `దేవుడు చేసిన మ‌నుషులు` త‌రువాత బాలీవుడ్ పై క‌న్నేసిన ఇలియానా కూడా… గ‌త ఏడాది ర‌వితేజ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని`తోనే తెలుగునాట రీ-ఎంట్రీ ఇచ్చింది.

మొత్త‌మ్మీద‌… క‌థానాయిక‌ల రీ-ఎంట్రీకి కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోతున్నాడు మ‌న మాస్ మహారాజా. మ‌రి… స్నేహ‌, శ్రియ రీ-ఎంట్రీకి క‌లిసొచ్చిన `ర‌వితేజ ఫ్యాక్ట‌ర్` శ్రుతికి కూడా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.