ఆ పాత్ర ఇవ్వమని వేడుకున్నాను..!

Vijay Sethupathi About His Role in Super Deluxe Movie

కాగా కేవలం హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే వైవిధ్యమైన నటుడిగా గుర్తుంపు తెచ్చుకున్నారు విజయ్. తెలుగు, తమిళ సినిమాలతో వరుస సినిమాలతో బిజీగా బిజీగా దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే విజయసేతుపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగులో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర సూపర్ డీలక్స్ సినిమాలో రోల్ అని చెప్పొచ్చు. ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. అయితే ఆ పాత్ర ఇమ్మని చాలా వేడుకున్నాడట విజయ్ సేతుపతి. ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పాడు. రీసెంట్ గా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సెలబ్రిటీస్ తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ సేతుపతి ని సూపర్ డీలక్స్ సినిమాలో మీరు భయపడిన సంఘటన ఏదైన ఉందా అని అడుగగా..? నిజానికి ఈ కథ విన్నప్పుడు సినిమాను మిస్ కాకూడదు అనుకున్నాను.. ఎట్టి పరిస్థితిలోనూ సినిమాను వదులుకోకూడదని అనుకున్నా.. నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు.. సినిమా నేను చేస్తా అని డైరెక్టర్ ను వేడుకున్న అని చెప్పాడు. మొదటి రోజు ఒక్క సన్నివేశం కోసం 50 టేకుల వరకూ తీసుకున్నా.. నేను ఎప్పుడూ ఎవర్ని కాపీ కొట్టలేదు.. నాకు ఎవరితో పోటీ లేదు.. నాతో నాకే పోటీ అని క్లారిటీ ఇచ్చాడు.

కాగా కోలీవుడ్, టాలీవుడ్ లలో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రవేశించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయా కామ్ 18 మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై అద్వైత్ చంద్రన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న కామెడీ డ్రామా లాల్ సింగ్ చద్దా మూవీ లో ఒక కీలక పాత్రకు విజయ్ సేతుపతి ఎంపిక అయ్యారు. మరి టాలెంట్ ఉంటే పాత్రలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పడానికి విజయ్ సేతుపతే ఒక ఉదాహరణ చెప్పొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here