90ఎమ్ఎల్ టైటిల్ సాంగ్ రిలీజ్

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ’90ML’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్, ట్రయిలర్ ను పాటలను రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు చిత్రయూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుండగా… రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాకు కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

MBA గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఓ యువకుడు… దేవదాస్‌గా ఎందుకు మారాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. మరి ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత ఆ రేంజ్ హిట్ కార్తికేయకు దక్కలేదు. మరి ఈ సినిమాతో అయినా మరి భారీ హిట్ కార్తికేయ ఖాతాలో పడుతుందో?లేదో? చూద్దాం..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =