బాలయ్యకు విలన్ గా రోజా..?

Roja Turns Villain For Balakrishna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Actress Roja Latest News,Heroine Roja Upcoming Movie News,Heroine Roja Turns Villain For Nandamuri Balakrishna,YSRCP MLA Roja Turns Villain For Balayya

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయదానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్ అవ్వగా.. ఇపుడు హ్యాట్రిక్ మూవీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బోయపాటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడట.

ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అందేంటంటే.. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం బోయపాటి వైసిపి ఎమ్మెల్యే, నటి రోజాని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి…రోజా ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ విలన్ లక్షణాలతో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ ఆ మేరకు బోయపాటి సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఇది కనుక నిజమే అయితే ఈ కాంబినేషన్ కే సినిమా పై అంచనాలు పెరిగిపోవడం ఖాయం. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =