యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం `వరల్డ్ ఫేమస్ లవర్`తో బిజీగా ఉన్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్… ఫిబ్రవరి 14న విడుదల కానుందని సమాచారం. ఈలోపే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్`ని పట్టాలెక్కించనున్నాడు విజయ్. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లోనూ విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని వినికిడి. మరి… ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే… ఇంద్రగంటి ప్రస్తుతం `వి`తో బిజీగా ఉన్నాడు. నేచురల్ స్టార్ నాని సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఉగాది కానుకగా మార్చి 25న థియేటర్లలోకి రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























