సల్మాన్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దబాంగ్ మూవీ సిరీస్ లో భాగంగా దబాంగ్ 3 తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్ కాస్టింగ్ &మీడియా లిమిటెడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. చిరు బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘ఇంద్ర’ సినిమాలో చిరు వేసే వీణ స్టెప్ ఎంతో ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఈ స్టెప్‌ను కంపోజ్ చేశారు. ఈ స్టెప్‌ను ఇప్పటివరకు చిరు తప్ప ఎవ్వరూ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయారు. ఇప్పుడు ఇదే స్టెప్ ను ‘దబాంగ్ 3’ సినిమాలో వేయనున్నాడట సల్మాన్. సినిమాను డైరెక్ట్ చేస్తున్న ప్రభుదేవా ఈ స్టెప్‌ను సల్మాన్‌కు నేర్పించి.. వేయించాలని చూస్తున్నారట. ఈ రకంగా చిరుకు మంచిగా ట్రిబ్యూట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరి ఎంతో మంది ఆ స్టెప్ ను ట్రై చేసినా ఆ రేంజ్ కు చేరుకోవడం కష్టమే. మరి చూద్దాం సల్మాన్ ఖాన్ తో ఎంత వరకూ వేయిస్తాడో ప్రభుదేవ.
కాగా హిందీలో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన ‘వాంటెడ్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందించాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాకు రీమేక్ అది. ఈ చిత్రం తర్వాత సల్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా వస్తుంది. అంతే కాదు ఈ సినిమాతో పాటు తాజాగా వీళ్లిద్దరు హాట్రిక్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ‘రాధే’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఈద్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: