మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో చివరి (ప్రస్తుతానికి) ఇండస్ట్రీ హిట్ గా నిలచిన చిత్రం `ఠాగూర్`. తమిళ బ్లాక్ బస్టర్ `రమణ` ఆధారంగా రూపొందిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్… అప్పట్లో పలు రికార్డులను భూస్థాపితం చేసింది. అలాంటి సినిమాలో చిరుకి జోడీగా మెరిసిన శ్రియ… మళ్ళీ పదహారేళ్ళ తరువాత మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇద్దరు నాయికలకు స్థానముండగా… వారిలో ఒకరిగా శ్రియ ఎంపికైందని సమాచారం. అంతేకాదు, శ్రియ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తుందని వినికిడి.
కాగా, మెగా ఫ్యామిలీతో శ్రియకి మంచి అనుబంధమే ఉంది. చిరుతో `ఠాగూర్`, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో `బాలు`, `కొమరం పులి` (ప్రత్యేక గీతం), `గోపాల గోపాల` సినిమాలు చేసింది శ్రియ. అలాగే రామ్ చరణ్ హీరో కాకముందు యాక్టింగ్ స్కూల్ లో శ్రియతో కలసి ఓ వీడియో చేసిన వైనం ఉంది.
ఏదేమైనా, శ్రియ ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో నటసింహ బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సరసన వరుస సినిమాలు చేసి అలరించిన శ్రియ… చిరుకి జోడీగానూ మరోసారి మురిపిస్తుందేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: