నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని..!

Vijay Deverakonda Opens Up About His Movies,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vijay Deverakonda New Movie Details,Actor Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Latest News About Movies

‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని’ అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఇంతకు ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. ఇంతకీ ఏ విషయంలో పగ తీర్చుకుంటా అంటున్నాడో తెలుసా..!అసలు సంగతేంటంటే.. ఇటీవల విజయ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా.. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవార’ని తెలిపాడు. నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికే సినిమాల్లోకి వచ్చాను. నేను సినిమా విజయవంతం అవుతుందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోను. నేను కేవలం మంచి సినిమాలు మాత్రమే చెస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నా చిత్రాన్ని ఇష్టపడకతే.. నేను అంటే ఏంటో నా తరువాతి చిత్రంలో చూపిస్తాను’ అని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా ఇలా వరుస సినిమాలతో హిట్ కొట్టి టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో వచ్చే ఏడాదికి కూడా డైరీ ఫుల్ చేసాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వం లో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా “వరల్డ్ ఫేమస్ లవర్” చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందనున్న “ఫైటర్ ” సినిమాలో నటించనున్నాడు.

వీటితోపాటు విజయ్ దేవరకొండ మరో రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వం లో రూపొందే రొమాంటిక్ డ్రామాలో, అలానే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీని విజయ్ దేవరకొండ లైన్ లో పెట్టాడు. ఇంకా మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి విజయ్ అనుకున్నది చేసి చూపెడతాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.