అర్జున్ సురవరం రివ్యూ – ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లు గా తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ మూవీ రీమేక్ గా తెరకెక్కిన సినిమా ‘అర్జున్ సురవరం’. కిర్రాక్ పార్టీ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నిఖిల్ ఆ తరువాత చేసిన చిత్రం అర్జున్ సురవరం. ఈ సినిమా మాత్రం నిఖిల్ ను బాగానే ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా పూర్తయి దాదాపు ఏడాది అయింది… అయితే సినిమా పలు కారణాలతో రిలీజ్ కి నోచుకోలేకపోయింది. మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టాడా..?లేదా..? అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న‌టీన‌టులు – నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, పోసాని త‌దిత‌రులు
డైరెక్టర్ – టి.ఎన్‌.సంతోష్‌
బ్యాన‌ర్ – మూవీ డైన‌మిక్స్ ఎల్.ఎల్.పి-ఆరా సినిమాస్
స‌మ‌ర్ప‌ణ‌ – బి.మ‌ధు

కథ:

ఓ టీవీ ఛానల్ లో రిపోర్ట‌ర్ గా పని చేస్తుంటాడు అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్). స్టింగ్ ఆప‌రేష‌న్ లో స్పెష‌లిస్టు. అయితే తనకు మాత్రం బీబీసీ ఛానల్లో జర్నలిస్ట్ అవ్వాల‌న్న‌ది ఆశ‌. దానికోసం ఎంతో కస్టపడి.. ఫైనల్ గా బీబీసీ లో జాబ్ సంపాదిస్తాడు. ఇక అక్కడికి వెళ్లిన అర్జున్ ఒక పెద్ద స్కామ్ పై స్టింగ్ ఆపరేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో తానే ఓ స్కాం కేసు కేసులో ఇరుక్కుంటాడు. స్కాం కేసు వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయి? ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అర్జున్ ఏం చేశాడు? ఇంతకు ఆ పెద్ద స్కామ్‌ ఏంటీ? ఆ స్కాం ను అర్జున్ ఛేదిస్తాడా లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా చేసేప్పుడు పడిన కష్టం ఏ సినిమా విషయంలో కూడా కష్టపడలేదని నిఖిల్ చెప్పినట్టే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. అర్జున్‌ లెనిన్‌ సురవరం పాత్రకు నిఖిల్‌ ప్రాణం పోసినట్లుగా నటించాడు. నిఖిల్ మ‌రోసారి క‌థ ప‌రంగా త‌న‌దైన సెలెక్ష‌న్ తో మెప్పించాడు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ చాలా బాగున్నాయి. యాక్షన్‌ సీన్స్‌లో అలాగే.. ఎమోషన్‌ సీన్స్‌లో నిఖిల్‌ నటనతో మెప్పించాడు.

ఇక హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి తక్కువ ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. సినిమాలో ఆమె కనిపించింది తక్కువే. అయితే వున్నంతలో త‌న పాత్ర ప‌రిధి మేర‌కు బాగానే నటించింది. త‌రుణ్ అరోరా విల‌నిజం ఆక‌ట్టుకుంది. ఇక వెన్నెల కిషోర్‌ ఎప్పటిలాగే తన మార్క్ కామెడీతో మెప్పించాడు. సత్య కూడా నిఖిల్‌ స్నేహితుడి పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు.

దర్శకుడు సంతోష్‌ కథను విభిన్నంగా నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఎలాగూ మాతృకకు తనే డైరెక్టర్ కాబట్టి ఈ సినిమాను కూడా అదే విధంగా తెరకెక్కించాడు. మెయిన్ ఎమోషన్ ఏ మాత్రం మిస్ కాకుండా మంచి స్క్రీన్ ప్లేతో నడిపించాడు.

చాలామంది యువత ఫేస్ చేస్తున్న ఫేక్ సర్టిఫికెట్ అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే విష‌య‌మే. పాయింట్ ప‌రంగా ‘అర్జున్ సుర‌వ‌రం’ గురి త‌ప్ప‌లేదు. ఈ క‌థ‌ని మొద‌లెట్టిన తీరు కూడా ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఒక మామూలు రిపోర్ట‌ర్ బీబీసీ రిపోర్ట్ గా ఎదిగే క్ర‌మంతో పాటు ఇంట‌ర్వెల్ లో అదిరిపోయే బ్యాంగ్ తో నేరేష‌న్ ఆక‌ట్టుకుంటుంది. ఫ‌స్టాఫ్ లెంగ్తీ అనిపించినా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. సెకండాఫ్ మొత్తం సీరియ‌స్ మోడ్ లో సాగుతుంది. అనవసరమైన కామెడీ సీన్లు ఇరికించకుండా ఒకటే ఫ్లో ను మెయింటైన్ చేసాడు డైరెక్టర్. ఇక విల‌న్ త‌రుణ్ ఆరోరా ఎంట్రీ తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు మెయిన్ ఇవే ప్రాణం. ఆ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ మరియు చేజింగ్‌ సీన్స్‌లో సినిమాటోగ్రఫీ పనితనం చాలా బాగుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం చాలా బాగుంది. కొన్ని సీన్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎక్కడికో తీసుకు వెళ్లింది. నిర్మాణ ప‌రంగా పూర్తి మార్కులు ప‌డ‌తాయి. టేకింగ్ బాగుంది. ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.

ఓవరాల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చూసే సినిమా అని చెప్పొచ్చు. నిఖిల్ ఇంతకాలం ఆగిన దానికి ఫలితం దక్కినట్టే. మంచి సినిమాను ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆధరిస్తారు అని చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here