ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. గ్లామర్ రోల్స్ లోనే కాదు డీ-గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించిన వైనం ఈ టాలెంటెడ్ బ్యూటీ సొంతం. ఈ నేపథ్యంలోనే… మరోసారి డీ-గ్లామర్ రోల్ లో కనిపించనుంది రకుల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి `చదరంగం`, `ఏ 1` అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. కాగా, ఇందులో రకుల్ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించనుంది. అయితే, ఇది ఓ డీ-గ్లామర్ క్యారెక్టర్ అని టాక్. అంతేకాదు… కథానాయకుడి పాత్రకి ధీటుగా ఈ పాత్ర ఉంటుందని వినికిడి. అలాగే, నటిగా రకుల్ ని మరో స్థాయికి తీసుకెళ్ళే పాత్రని అంతర్గత వర్గాల సమాచారం.
మరి.. సరికొత్త పాత్రలో రకుల్ ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచిచూడాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































