పోరాట ఘ‌ట్టాల‌తో ప్రారంభం కానున్న‌ `ఫైట‌ర్`?

Puri Jagannadh And Vijay Deverakonda Fighter Movie Latest Update

`ఇస్మార్ట్ శంక‌ర్`తో బౌన్స్ బ్యాక్ అయిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్… త‌న నెక్ట్స్ వెంచ‌ర్ ని యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఫైట‌ర్` పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో విజ‌య్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. క‌థానాయిక పాత్ర కోసం `ఇస్మార్ట్` గాళ్ నిధి అగ‌ర్వాల్, `వింక్` బ్యూటీ ప్రియ ప్ర‌కాష్ వారియ‌ర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నాలుగో వారంలో ప్రారంభ‌మ‌వుతుంద‌ని వినికిడి. అలాగే, యాక్ష‌న్ సీక్వెన్స్ తో సినిమాకి శ్రీ‌కారం చుడ‌తార‌ని స‌మాచారం. అదే విధంగా, `అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి` త‌ర‌హాలో మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్న `ఫైట‌ర్`కి మ‌ణిశ‌ర్మ బాణీలు అందించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + thirteen =