‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ లో సందీప్ కిషన్ కూడా..?

Sundeep Kishan Pivotal Role In The Family Man 2 Web Series,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Sundeep Kishan Interesting Role in The Family Man 2 Series,The Family Man 2 Web Series Latest News

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ ద ఫ్యామిలీ మ్యాన్’.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు అఫీషియల్ గా కూడా ప్రకటన వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ లో సందీప్ కిషన్ కమాండో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీజన్ 2లో కూడా సందీప్ కిషన్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే చేస్తున్నాడా..? చేస్తే మళ్ళీ కమాండో పాత్రలోనే చేస్తున్నాడా..? వేరే ఏదైనా రోల్..? తెలియాలంటే మాత్రం దీనిపై కూడా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో ‘షోర్ ఇన్ ది సిటీ’, ‘గో గోవా గాన్’ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ్, తెలుగు లో కూడా ఈ వెబ్ సిరీస్ ను తీయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =