సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు విశాల్. విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో ‘డిటెక్టివ్’ సినిమా వచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన తుప్పరివాలన్ తమిళ మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘డిటెక్టివ్’ కూడా మూవీ ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ‘డిటెక్టివ్’ సినిమా సీక్వెల్ చేస్తున్న సంగతి కూడా విదితమే. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కబోతోంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న డిటెక్టివ్ 2 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ 40 రోజులపాటు బ్రిస్టల్ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాల్, ప్రసన్న వున్న ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ విశాల్ మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వచ్చాడని.. ఈసారి హంటింగ్ లండన్ లో అంటూ ట్వీట్ చేశారు.
#KaniyanPoonkundran & #Mano back in action again, this time hunting in London !!#Thupparivaalan2 #Detective2 pic.twitter.com/cKEVL6J7dM
— Vishal Film Factory (@VffVishal) November 28, 2019
కాగా ఈ సినిమాలో ప్రసన్న కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆశ్య హీరోయిన్‌గా ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























