నాని, శివ నిర్వాణ‌… ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

Nani And Shiva Nirvana Movie To Be Launched Soon

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన `నిన్ను కోరి` చిత్రంతో ద‌ర్శ‌కుడ‌య్యాడు శివ నిర్వాణ‌. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మెప్పించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్… రీసెంట్ గా `మ‌జిలీ`తో మ‌రో మెమ‌ర‌బుల్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. క‌ట్ చేస్తే… ఇప్పుడు త‌న మూడో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు శివ‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు నానితో రూపొందించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రెండో సినిమా (`మ‌జిలీ`) నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అలాగే `నిన్ను కోరి`, `మ‌జిలీ`కి స్వ‌రాలు అందించిన గోపీసుంద‌ర్… ఈ సినిమాకి కూడా బాణీలు అందిస్తాడ‌ట‌. కాగా, డిసెంబ‌ర్ 1న ఈ మూవీ ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. దీనికి సంబంధించి మ‌రికొద్ది గంట‌ల్లో అధికారిక‌ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ప్ర‌స్తుతం నాని త‌న సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ `వి`తో బిజీగా ఉన్నాడు. మార్చి 25న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =