హీరో కార్తికేయ కు జోడీ గా లావణ్య త్రిపాఠి ?

Hero Kartikeya Teams Up With Lavanya Tripathi

బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరిచినా కొత్త మూవీ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. హీరో గానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా కార్తికేయ నటిస్తున్నారు. ఒక నూతన దర్శకుడు రూపొందించనున్న మూవీ కి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ లో కార్తికేయ హీరోగా ఎంపిక అయ్యారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక విభిన్న కథ తో “చావు కబురు చల్లగా ” మూవీ రూపొందనుంది. “బస్తీ బాలరాజు “క్యారెక్టర్ లో కార్తికేయ నటించనున్నారు. ఈ మూవీ లో కార్తికేయ కు జోడీ గా లావణ్య త్రిపాఠి నటించనున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.