శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై అంచనాలు పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సరిలేరు నీకెవ్వరు ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా జనవరి 5వ తేదీ ఎల్ బి స్టేడియం, హైదరాబాద్ లో జరుగనుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ మరో స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారని సమాచారం. మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “మహర్షి ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథి గా పాల్గొన్న విషయం తెలిసిందే. జనవరి 9వ తేదీ జరిగే “సరిలేరు నీకెవ్వరు ” మూవీ స్పెషల్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథి గా పాల్గొంటారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: