‘హిట్’ నుండి త్వరలో ఫస్ట్ గ్లింప్స్

Hit Movie First Glimpse Out Tomorrow

మొదటి సినిమాతోనే అటు డైరెక్టర్ గా, నిర్మాతగా, హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు `ఫ‌ల‌క్‌నుమాదాస్` ఫేమ్‌ విశ్వ‌క్‌సేన్. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో వస్తున్నాడు. వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే `అ!` వంటి డిఫ‌రెంట్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి నిర్మాత‌గా స‌క్సెస్‌ను సాధించాడు నాని. ఇప్పుడు నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై విశ్వ‌క్‌సేన్ హీరోగా ‘హిట్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్ విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. జనవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.

కాగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న ఈ సినిమాకు మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా.. వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.