ఈ క్యాలెండర్ ఇయర్ లో పలువురు సినీ ప్రముఖులు… చాలా కాలం తరువాత మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. తమ బౌన్స్ బ్యాక్ తో అభిమానుల్లోనూ జోష్ పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `ఇస్మార్ట్ శంకర్`తో ఆ చిత్ర కథానాయకుడు రామ్, దర్శకుడు పూరీ జగన్నాథ్, సంగీత దర్శకుడు మణిశర్మ చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ చూశారు. ఒకే సినిమాతో ఇలా ముగ్గురు `బౌన్స్ బ్యాక్` కావడం పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
అలాగే అరడజను అపజయాల తరువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్ `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలో ఈ ఏడాది రెండు వరుస విజయాలు చూసి… బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అదే విధంగా `మజిలీ`తో నాగచైతన్య, `ఖైదీ`తో కార్తి, `ఎఫ్ 2`తో మెహరీన్, `అర్జున్ సురవరం`తో లావణ్య త్రిపాఠి, `రాక్షసుడు` అనుపమ పరమేశ్వర్ కూడా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు.
మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన వీళ్ళంతా మున్ముందు మరిన్ని విజయాలతో ఆకట్టుకోవాలని ఆకాంక్షిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: