
ట్యాగ్ · 107 కథనాలు · పేజీ 2


నవదీప్ కు బన్నీ కాస్ట్లీ గిఫ్ట్..!
అల్లు అర్జున్ కు ఘన సన్మానం

బాలీవుడ్ దర్శకుడితో అల్లు అర్జున్ సమావేశం
ఆధ్యాత్మిక క్షేత్రంలో అల్లు అర్జున్
'బన్నీ' కి 'అర్హ' స్వీట్ వెల్ కమ్..!

ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉంది
"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

పుష్ప లో మరో విలన్..?
రెండు భాగాలుగా "పుష్ప" ?
అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

అల్లు అర్జున్ పై కంగనా రనౌత్ ప్రశంసలు
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో సుమారు 130 కోట్లు…

నవదీప్ కు బన్నీ కాస్ట్లీ గిఫ్ట్..!
ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అలవాటే. ఏదైనా సినిమా మంచి బ్లాక్ బస్టర్ కొట్టిందంటే డైరెక్టర్లకు హీరోలు కార్ల దగ్గర నుండి ఎంతో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఎన్నోచూశాం. ఇక కొంతమంది స్పెషల్ గూడ్స్ ను తమకు ఎంతో స్పెషల్ అయిన వాళ్లకు పంపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు నవదీప్ కు కూడా అలాంటి కాస్ట్లీ గిఫ్టే అందింది. ఇచ్చింది ఎవరో కాదు బన్నీ. నవదీప్ స్వయంగా ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. ప్రేమకు అవధులు లేనప్పుడు, బహుమతులు సందర్భానుసారంగా ఉంటాయి. ధన్యవాదాలు, బావ్స్ అల్లు అర్జున్. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ తో ఎయిర్ పొడ్స్ వాడతా అంటూ తన…

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ పై అల్లు అర్జున్ ప్రశంసలు
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక…

యూరోప్ లో వైఫ్ &ఫ్రెండ్స్ తో అల్లు అర్జున్ ఎంజాయ్
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన "పుష్ప :ది రైజ్" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన ఈ మూవీ కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రఫ్ &మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అల్లు అర్జున్ ప్రేక్షక , అభిమానుల ,సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. "పుష్ప :ది రైజ్" మూవీతో అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ హీరోగా "పుష్ప :ది రూల్" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

పోల్ గేమ్ : అల్లు అర్జున్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ ?
సరైనోడు : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరైనోడు ” మూవీ ఘనవిజయం సాధించింది. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్టైల్ తో అల్లు అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ , సాంగ్స్ లో హీరో అల్లు అర్జున్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. అల్లు అర్జున్ , ఆది ల క్లైమాక్స్ ఫైట్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మాస్ ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్ తో “సరైనోడు ” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు బోయపాటి తనదైన మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను అలరించారు.
అభిమానులే స్ట్రెంగ్త్ &ఇన్ స్పిరేషన్ -అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం…

'అల్లు అయాన్' కి బన్నీ ఎమోషనల్ బర్త్ డే విషెస్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన టైమ్ కూడా ఇస్తాడు. అందుకే టాలీవుడ్ లో ఉన్న ఫ్యామిలీ పర్సన్ హీరోస్ లో అల్లు అర్జున్ కూడా మొదటి వరుసలో ఉంటాడు. తన పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి తను కూడా అల్లరి చేస్తుంటాడు. అప్పుడప్పుడు వారి వీడియోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు కూడా అల్లు అర్జున్ అలానే సతీమణి స్నేహా రెడ్డి. ఇక అల్లు అయాన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈసందర్భంగా అల్లు అర్జున్ తనయుడికి బర్త్ డే విషెస్ అందించాడు. నా లవ్ అల్లు అయాన్ హ్యాపీ బర్త్ డే.. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను…

లిటిల్ గ్రాడ్యుయేట్ అర్హ కు అభినందనలు - అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప:ది రైజ్ “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు “పుష్ప:ది రైజ్ “మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప:ది రూల్ “మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ అల్లు అర్జున్ పలు ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ కు ఘన సన్మానం
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల తో పాటు ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్యి సుమారు 360 కోట్లు కు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

బాలీవుడ్ దర్శకుడితో అల్లు అర్జున్ సమావేశం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన "పుష్ప:ది రైజ్ "మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు "పుష్ప:ది రైజ్ "మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తో అల్లు అర్జున్ ముంబై లో సమావేశం అవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుందనే అభిప్రాయం ఏర్పడింది.
ఆధ్యాత్మిక క్షేత్రంలో అల్లు అర్జున్
హైదరాబాద్ శంషాబాద్ ముచ్చింతల్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణ లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలలో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీరామనగరంలో సమతామూర్తితో పాటు, దివ్యాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రుత్విక్కులు శ్రీరామనగరంలోని సమతామూర్తి ఆలయ విశేషాలను ఆయనకు వివరించారు.
'బన్నీ' కి 'అర్హ' స్వీట్ వెల్ కమ్..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమా పుష్ప హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తున్నాం. సుకుమార్ దర్శకత్వంలో రా అండ్ కల్ట్ సినిమాగా తెరకెక్కగా అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మాత్రం ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పుష్ప పాటలు సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో ఊపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి మొదటిపాన్ ఇండియా పుష్ప సక్సెస్‌ను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ.

ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉంది
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ఆ అంచనాలను నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారి వచ్చిన పాన్ ఇండియా మూవీ.. అందుకే ఈసినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి మొదటి పాన్ ఇండియాతో దేశ వ్యాప్తంగా తన సత్తా చూపిస్తున్నాడు. మన హీరో కాబట్టి మన తెలుగు వాళ్లు ఎలాగైనా సినిమా చూసేస్తారు. కానీ వేరే భాషల్లో కూడా పుష్ప రాజ్ బాగానే తమ మార్క్ ను చూపిస్తున్నాడు. ముఖ్యంగా బన్నీ పర్ఫామెన్స్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎప్పుడూ స్టైలిష్ గా కనబడే బన్నీ ఈసినిమాకు తన కట్టు, భాష అన్నీ మార్చేశాడు. ఊరమాస్ లో బన్నీచేసిన రచ్చకు అందరూ…
"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమానులు అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. "పుష్ప "మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు , మలయాళ ప్రేక్షకులనే కాదు డబ్బింగ్ మూవీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. 2020 సంవత్సరం బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ మూవీ లో నటిస్తున్నారు.
అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
"గంగోత్రి "మూవీ తో హీరో గా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ "ఆర్య "మూవీ తో ఘనవిజయం సాధించారు. 18 సంవత్సరాలుగా పలుబ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు.

పుష్ప లో మరో విలన్..?
పుష్ప సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈసినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. ఇక ఈమధ్యకాలంలో ఈసినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని చూస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.. అది కూడా కన్ఫామ్ అయినట్టు కూడా తేలిపోయింది. ప్రస్తుతం సుక్కూ అండ్ టీమ్ రెండు భాగాలుగా చేసిన స్క్రిప్ట్ లో మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ముందుగా రాసుకున్న కథకు ఇప్పుడు అదనంగా కొత్త కంటెంట్ ని యాడ్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే 30-35 నిమిషాలకు పైగా నిడివిని పెంచాల్సి ఉంటుంది.

డిఫరెంట్ టైటిల్స్- పార్ట్ 1 కు 'పుష్ప'..పార్ట్ 2కి..?
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా పుష్ప.. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుకుమార్. ఇక ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి తోడు బన్నీ బర్త్ డే కు రిలీజ్ చేసిన టీజర్ ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1.5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడంతోపాటు.. 65 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది.
రెండు భాగాలుగా "పుష్ప" ?
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురుప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి హీరోలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకోగా తాజాగా అల్లు అర్జున్ కోలుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా కరోనా పరీక్షలలో నెగటివ్ గా నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.