సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో సుమారు 130 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన “పుష్ప: ది రైజ్” మూవీ పై బాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ , అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ధాక్కడ్” హిందీ మూవీ 20 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. అల్లు అర్జున్‌లో ప్రేక్షకులు తమను చూసుకున్నారు కాబట్టి “పుష్ప” చిత్రం దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకొని బ్లాక్‌బస్టర్ అయిందనీ , ఇప్పుడున్న బాలీవుడ్ హీరోలు పుష్పరాజ్ లాంటి సాధారణ కూలీ పాత్రను పోషించడానికి ఇష్టపడరనీ , ఇప్పుడు హిందీ పరిశ్రమ కన్నా దక్షిణాది సినిమాలు ఎక్కువ విజయాలు సాధిస్తున్నాయనీ , దక్షిణాది హీరోలు తమ మూలాలను మరవకపోవడమే అందుకు కారణమనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.