
ట్యాగ్ · 34 కథనాలు


టైమ్స్ వరల్డ్ టాప్ 100 లిస్ట్ లో రాజమౌళి

దర్శకుడు రాజమౌళి ఆస్కార్ పార్టీ

జపాన్ లో దర్శకుడు రాజమౌళి రికార్డ్

నాని దసరా మూవీ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు

డబ్బు కోసం సినిమాలు చేస్తాను

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29

యాక్షన్ జానర్ యూనివర్శల్ లాంగ్వేజ్..!

సినీ ప్రముఖుల వాయిస్ ఓవర్ తో "రాధేశ్యామ్"

'ఆర్ఆర్ఆర్' వాయిదా పడదు.. కన్ఫామ్ చేసిన రాజమౌళి

'బ్రహ్మాస్త్ర' కు అతిథిగా రాజమౌళి..!

'బాహుబలి 3' గురించి రాజమౌళి..!

మహేష్ సినిమాపై రాజమౌళి క్లారిటీ..!

'ఆర్ఆర్ఆర్' కోసం పక్కా ప్లాన్ తో జక్కన్న..!

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి
నిర్మాత 'దొరస్వామి' కి రాజమౌళి సంతాపం

క్రికెట్ రంగంలోకి జక్కన్న- ISBC చైర్మన్‌గా కొత్త బాధ్యతలు
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గ్లోబల్ లెవల్ కి మన ఇండస్ట్రీని తీసుకెళ్లి ప్రపంచం మొత్తం టాలీవుడ్ ను వైపు చూసేలా చేశాడు. అంతర్జాతీయ స్థాయి నటులు కూడా మన హీరోలతో చేయాలని ఉందని చెబుతున్నారంటేనే అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుతం మరో చరిత్ర తిరగరాసే సినిమా కోసం రెడీ అవుతున్నాడు రాజమౌళి. తన కొత్త సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఫారెస్ట్ అడ్వెంచరస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈసినిమా కోసం సాలిడ్ కథను…

టైమ్స్ వరల్డ్ టాప్ 100 లిస్ట్ లో రాజమౌళి
కెరీర్ లో ఫ్లాప్స్ అంటూ తెలియన్ డైరెక్టర్ ఎవరంటే దర్శకధీరుడు రాజమౌళి పేరు ముందొస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఒక్కసారైనా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుందనుకోండి. ఇకసాధారణంగా ఒక సినిమాకు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే సమీకరణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయాడు రాజమౌళి. ఇప్పుడు తను ఏ సినిమా తీసినా అది సంచలనమే అన్న రేంజ్ కు ఎదిగిపోయాడు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు.

దర్శకుడు రాజమౌళి ఆస్కార్ పార్టీ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్…

జపాన్ లో దర్శకుడు రాజమౌళి రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

నాని దసరా మూవీ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

డబ్బు కోసం సినిమాలు చేస్తాను
దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఆయన నుండి సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మాత్రమే కాదు అంతర్జాతీయ ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం ఎంతో కష్టపడతారు. అందుకే తన కెరీర్ లో ఫెయిల్యూర్ అనే పదానికి చోటు లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ…

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకె క్కుతుంది. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హాలీవుడ్ గవర్నర్స్ అవార్డ్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా రాజమౌళి
సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. వరుసగా 1000కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీస్ ను తెరకెక్కించి దర్శకుడు రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రశంసలు
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

యాక్షన్ జానర్ యూనివర్శల్ లాంగ్వేజ్..!
మన తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు నార్త్ లోనే మన తెలుగు సినిమాలకు మార్కెట్ దక్కాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ మారుతున్న పరిస్థితులు, ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో వస్తున్న మార్పుల వల్ల సినిమాకు లాంగ్వెజ్ బారియర్ లేకుండా అయిపోయింది. ఇక మన తెలుగు సినిమాలకు నార్త్ లో అంత క్రేజ్ రావడానికి పునాది వేసిన వాళ్లలో రాజమౌళి ఒకరు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు రాజమౌళి. ఆ తర్వాత నుండి చాలా మంది పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. ఇక ఈమధ్యకాలంలో పలు సినిమాలు దేశవ్యాప్తంగా తమ సత్తాను చాటాయి.

సినీ ప్రముఖుల వాయిస్ ఓవర్ తో "రాధేశ్యామ్"
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు…

'ఆర్ఆర్ఆర్' వాయిదా పడదు.. కన్ఫామ్ చేసిన రాజమౌళి
రాజమౌళి సినిమా అంటే వాయిదా పడుతుందనే అనుమానంలోనే ఉన్నట్టున్నారు ఇంకా చాలా మంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమా జనవరి 7న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు. అయితే ఒక పక్క ప్రమోషన్స్ చేస్తున్నా.. మరోవైపు మాత్రం ఈసినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. రిలీజ్ కు ఇంకా పది రోజులు కూడా లేదు.. ఈ టైమ్ లో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా రిలీజ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని.. చెప్పిన రిలీజ్ డేట్ కే రిలీజ్ అవుతుందని రాజమౌళి కన్ఫామ్ చేశారు. ఇక ఈ…

'బ్రహ్మాస్త్ర' కు అతిథిగా రాజమౌళి..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ రిలీజ్ మాత్రం కాలేకపోయింది. మధ్యలో కరోనా కూడా రావడం వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ రీసెంట్ గానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రణబీర్ కపూర్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. దానితోపాటు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

'బాహుబలి 3' గురించి రాజమౌళి..!
తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 అండ్ 2 అని. ఈసినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఏసినిమా అయినా సరే టైమ్ గురించి ఆలోచించకుండా పర్ ఫెక్ట్ గా వచ్చేంత వరకూ దాన్ని తీర్చిదిద్దుతూనే ఉంటాడు రాజమౌళి. అందుకే జక్కన్న అనే పేరును సొంతం చేసుకున్నాడు. పేరుకు తగ్గట్టే ఇంత వరకూ సక్సెస్ తప్ప పరాజయాన్ని చవి చూడలేదు. అలా తను చెక్కిన ఒక శిల్పం లాంటిదే బాహుబలి. ఈసిరీస్ కోసం దాదాపు 5ఏళ్లు తీసుకున్నాడు రాజమౌళి. అయితే సినిమా రిలీజ్ తరువాత ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలికి ప్రత్యేక…

మహేష్ సినిమాపై రాజమౌళి క్లారిటీ..!
మహేష్-రాజమౌళి కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు.. మహేష్ ను ఎలా చూపిస్తాడు లాంటి విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే మహేష్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మాత్రం తెలీదు. ఇక తాజాగా మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.

అజయ్ దేవగన్ సినీ ప్రస్థానానికి 30 ఏళ్లు.. రాజమౌళి విషెస్..!
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈరోజుతో తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు. 'ఫూల్ ఔర్ కాంటే' సినిమా వచ్చి 30 ఏళ్లు అయింది. ఇక ఈనేపథ్యంలో 30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో అజయ్ దేవగన్ కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజమౌళి కూడా అజయ్ దేవగన్ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియచేశారు. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ అజయ్ దేవగన్ సర్.. సినిమా పట్ల మీకు ఉండే ప్యాషన్, డెడికేషన్ అన్ మ్యాచ్ బుల్.. మక్కీ.. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ.. ముందు ముందు కూడా ఇలానే సక్సెస్ అందుకోవాలని…

'ఆర్ఆర్ఆర్' కోసం పక్కా ప్లాన్ తో జక్కన్న..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎన్టీఆర్-చరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో బ్రేక్ ల తరువాత మొత్తానికి ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!
రాజమౌళి తో సినిమా అంటే ప్రతి ఒక్కహీరోకి చేయాలన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పటికీ పది సినిమాల వరకూ చేశాడు.. అన్ని సినిమాలు సూపర్ హిట్టే.. అప్పటికే డైరెక్టర్ గా రాజమౌళికి మంచి పేరుంది.. ఇక బాహుబలితో తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచస్థాయికి తెలియచేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈప్రాజెక్ట్ తన పదేళ్ల డ్రీమ్ అంటున్నాడు రాజమౌళి. ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలంటే ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కు అంత ఈజీ కాదు.. చాలా కష్టం అందులోనూ ఎన్టీఆర్-చరణ్ మంచి స్నేహితులే అయినా కూడా ఈడ్రీమ్ ఫుల్ ఫిల్ అవ్వడానికి 10ఏళ్లు టైమ్ పట్టింది అని చెప్పుకొచ్చాడు.

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి
కీరవాణి తనయులు ఇద్దరూ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు తనయుడు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడగా ఇప్పుడు పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు శ్రీసింహా కూడా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నారు.
నిర్మాత 'దొరస్వామి' కి రాజమౌళి సంతాపం
సీనియర్ నిర్మాత వి.దొరస్వామి రాజు ఈ రోజు కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో... అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కాగా వి.దొరస్వామి రాజు మృతికి జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.