‘బాహుబలి 3’ గురించి రాజమౌళి..!

SS Rajamouli Gives A Huge Update On Baahubali 3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,2021 Telugu Film News,Tollywood Movie Updates,Tollywood Latest News,SS Rajamouli,SS Rajamouli Latest News,Director SS Rajamouli Latest Update,Baahubali 3 Movie,Baahubali 3 Movie News,Baahubali 3 Movie Latest News,Baahubali 3 Movie Latest Updates,Baahubali 3 Movie Update,SS Rajamouli About Baahubali 3 Movie,SS Rajamouli Comments On Baahubali 3 Movie,Baahubali 3,Baahubali 3 Movie,Baahubali 3 Telugu Movie

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 అండ్ 2 అని. ఈసినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఏసినిమా అయినా సరే టైమ్ గురించి ఆలోచించకుండా పర్ ఫెక్ట్ గా వచ్చేంత వరకూ దాన్ని తీర్చిదిద్దుతూనే ఉంటాడు రాజమౌళి. అందుకే జక్కన్న అనే పేరును సొంతం చేసుకున్నాడు. పేరుకు తగ్గట్టే ఇంత వరకూ సక్సెస్ తప్ప పరాజయాన్ని చవి చూడలేదు. అలా తను చెక్కిన ఒక శిల్పం లాంటిదే బాహుబలి. ఈసిరీస్ కోసం దాదాపు 5ఏళ్లు తీసుకున్నాడు రాజమౌళి. అయితే సినిమా రిలీజ్ తరువాత ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దాదాపు రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు, ఎన్నో అవార్డులు దక్కాయి ఈసినిమాకు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి ఇప్పటివరకూ బాహుబలి 1, బాహుబలి 2 వచ్చాయి.. మరి బాహుబలి 3 వస్తే ఎలా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. తాజాాగా రాజమౌళి దీని గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈసందర్భంగా రాజమౌళి బాహుబలి 3 గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. బాహుబలి 3 ఖచ్చింతగా ఉంటుందని.. బాహుబలి అనే కథ నుండి ఎన్ని సినిమాలైనా తీయోచ్చు.. పార్ట్ 3 ఉంటుంది.. అయితే ప్రస్తుతానికి దాని గురించి మాట్లాడే సమయం కాదు.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాపైనే నా ఫోకస్ ఉంది అంటూ తెలిపాడు. చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా బాహుబలి 3 సినిమా వచ్చే అవకాశం ఉందేమో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 4 =