బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈరోజుతో తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు. ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమా వచ్చి 30 ఏళ్లు అయింది. ఇక ఈనేపథ్యంలో 30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో అజయ్ దేవగన్ కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజమౌళి కూడా అజయ్ దేవగన్ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియచేశారు. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ అజయ్ దేవగన్ సర్.. సినిమా పట్ల మీకు ఉండే ప్యాషన్, డెడికేషన్ అన్ మ్యాచ్ బుల్.. మక్కీ.. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ.. ముందు ముందు కూడా ఇలానే సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Congratulations @ajaydevgn sir for completing 30 years in the film industry. Your dedication and passion towards cinema are unmatchable. Wishing you many more successes in the years to come..:)
It was a pleasure to be associated with you for #Makkhi and to have you in #RRRMovie. pic.twitter.com/G34H8wf3Uy
— rajamouli ss (@ssrajamouli) November 22, 2021
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానుండగా, ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: