రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎన్టీఆర్-చరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో బ్రేక్ ల తరువాత మొత్తానికి ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా రాజమౌళి తన సినిమాను ఎలా ప్రమోట్ చేస్తాడో అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సినిమా తీయడంలో ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తాడో అలానే ప్రమోషన్స్ ను కూడా అంతే సీరియస్ గా తీసుకొని అంతే కొత్తగా చేయడానికి చూస్తాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా రాజమౌళి అదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లను కొత్తగా అలానే పక్కా ప్లాన్ తో భారీగా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రమోషన్స్ కి ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి టీమ్. జనవరిలో సినిమా రిలీజవుతోంది కాబట్టి నవంబర్, డిసెంబర్ లో ప్రచారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్లాన్ ని డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: