రాజమౌళి సినిమా అంటే వాయిదా పడుతుందనే అనుమానంలోనే ఉన్నట్టున్నారు ఇంకా చాలా మంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-చరణ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమా జనవరి 7న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు. అయితే ఒక పక్క ప్రమోషన్స్ చేస్తున్నా.. మరోవైపు మాత్రం ఈసినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. రిలీజ్ కు ఇంకా పది రోజులు కూడా లేదు.. ఈ టైమ్ లో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా రిలీజ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని.. చెప్పిన రిలీజ్ డేట్ కే రిలీజ్ అవుతుందని రాజమౌళి కన్ఫామ్ చేశారు. ఇక ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వాటిని తొలగించారు. తాజాగా తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వదని.. చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుందని… రాజమౌళి స్వయంగా చెప్పారని పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Xclusiv… BREAKING NEWS… ‘RRR’ VERY MUCH ON 7 JAN 2022… SS RAJAMOULI OFFICIAL STATEMENT TO ME… No postponement. #SSRajamouli #JrNTR #RamCharan #RRR #RRRMovie #RRRPreReleaseEvent #RoarOfRRRInKerala pic.twitter.com/DmHdvp986U
— taran adarsh (@taran_adarsh) December 29, 2021
కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: