దర్శకుడు రాజమౌళి ఆస్కార్ పార్టీ

SS Rajamouli Oscar Party

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస్కార్ వేడుక అయిన తర్వాత సక్సెస్ పార్టీని రాజమౌళి లాస్ ఏంజిల్స్  తన  ఇంట్లో నిర్వహించారు.ఈ పార్టీలో ఎంఎం కీరవాణి పియానో వాయిస్తూ ఆహ్లాదం నింపారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో ఆర్ఆర్ఆర్ కి వచ్చిన అవార్డులు అన్నింటిని కూడా ఒకే చోట పెట్టారు. వాటి మధ్యలో ఆస్కార్ అవార్డు ఉంచారు.ఇక నాటు నాటు సాంగ్ బెలూన్స్ ఆర్ఆర్ఆర్ బెలూన్స్ తో ఇళ్ళు మొత్తం డెకరేట్ చేశారు. మొత్తానికి ఈ ఆస్కార్ సెలబ్రేషన్స్ ని చిత్ర యూనిట్ మొత్తం చాలా గ్రాండ్ గా చేసుకుంది .ఇక ఇండియా వచ్చాక కూడా వారికీ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పడానికి ఆయా స్టార్స్ అభిమానులు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కి ప్రత్యేకంగా సన్మానం చేయడానికి సిద్ధం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 9 =