సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. వరుసగా 1000కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీస్ ను తెరకెక్కించి దర్శకుడు రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆస్కార్ అవార్డ్స్ కై ఆర్ ఆర్ ఆర్ మూవీ అన్ని విభాగాలలో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డులకు ప్రధానానికి ముందు ప్రతి ఏటా గవర్నర్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహిస్తుంటారు.లాస్ ఏంజల్స్ వేదికగా ఆదివారం జరిగిన గవర్నర్స్ అవార్డ్స్ వేడుకకు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తన తనయుడు కార్తికేయతో అటెండ్ అయ్యారు. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డ్స్ వేడుకలో దర్శకుడు రాజమౌళి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తండ్రిరాజమౌళితో కలిసి దిగిన ఓ ఫొటోను కార్తికేయసోషల్ మీడియా లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: