టైమ్స్ వరల్డ్ టాప్ 100 లిస్ట్ లో రాజమౌళి

ss rajamouli in times top 100 most influential list

కెరీర్ లో ఫ్లాప్స్ అంటూ తెలియన్ డైరెక్టర్ ఎవరంటే దర్శకధీరుడు రాజమౌళి పేరు ముందొస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఒక్కసారైనా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుందనుకోండి. ఇకసాధారణంగా ఒక సినిమాకు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే సమీకరణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయాడు రాజమౌళి. ఇప్పుడు తను ఏ సినిమా తీసినా అది సంచలనమే అన్న రేంజ్ కు ఎదిగిపోయాడు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రుచిని ప్రపంచానికి చూపించిన రాజమౌళి ఈసారి ఆర్ఆర్ఆర్ ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అందుకే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లగొట్టింది ఈసినిమా. దానితో పాటు తెలుగు సినిమా గర్వించే విధంగా ఆస్కార్ అవార్డును సైతం అందుకుంది ఈసినిమా. ఇప్పటికే ఎన్నో అరుదైన అవార్డులు, రివార్డులు అందుకున్న రాజమౌళికి తాజాగా మరో గౌరవం దక్కింది. ప్రతి ఏడాది టైమ్స్ మ్యాగజైన్ వారు ప్రపంచలోని 100 ప్రతిభావంతుల లిస్ట్ ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది కూడా లిస్ట్ ను రిలీజ్ చేశారు. అయితే ఈలిస్ట్ లో రాజమౌళికి కూడా స్థానం దక్కింది. ఈజాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ దర్శకుడు రాజమౌళినే. మరి రాజమౌళికి ఇలాంటి గౌరవం దక్కడం అనేది తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళితో పాటు షారుఖ్ ఖాన్ కూడా ఈలిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =