ట్యాగ్ · 34 కథనాలు · పేజీ 2
జక్కన్నకు 'RRR' టీమ్ బర్త్ డే విషెస్
ప్లాస్మా దాతలు నిజమైన హీరోలు

రాజమౌళి తన కథతోనే సమాధానం ఇస్తాడు..!
అందరి కన్ను రాజమౌళి షూటింగ్ పైనే..!
థ్యాంక్స్ కేసీఆర్ సర్.. ఇప్పుడు భాద్యత మాపై ఉంది..!

రష్యన్ ఛానల్ లో బాహుబలి 2

సినిమాకే హైలైట్ గా 'బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్'
మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!

స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన
మంచి టైటిల్ ను మిస్ చేసుకున్న రాజమౌళి..!
రాజమౌళి పై 'RRR' టీమ్ ఫిర్యాదులు
ఒక్కో సినిమాను రాజమౌళి ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతాడో అందరికీ తెలుసు. ఒక శిల్పాన్ని ఎంతో జాగ్రత్తగా ఎలా చెక్కుతారో అలా చెక్కుతాడు కాబట్టే ఆయనకు జక్కన్న అన్న పేరు పెట్టారు. అలా ఉంటాడు కాబట్టే మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి కారణమయ్యాడు. దేశం గర్వించదగ్గ దర్శకుడు అయ్యాడు. ఇక ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు సినీ ప్రముఖుల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విచిత్రం ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. సీరియస్ గా ఏం కాదులెండి కామెడీగా. సెట్స్ లో రాజమౌళి బర్త్‌డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు ఆయన సెట్‌లో ఎలా ఉంటారనే…
జక్కన్నకు 'RRR' టీమ్ బర్త్ డే విషెస్
`బాహుబలి`సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకదిగ్గజం రాజమౌళి. ఇక ఈరోజు రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటులు కూడా జక్కన్నకు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ అందించారు.
ప్లాస్మా దాతలు నిజమైన హీరోలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లాస్మా దాతలే నిజమైన హీరోలు అంటున్నారు రాజమౌళి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. జాగ్రత్తలు తీసుకున్నా.. తీసుకోకపోయినా ఈ మహమ్మారి మాత్రం అందరికీ వ్యాప్తిస్తూనే ఉంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ కు షూటింగ్స్ వెళ్లకపోయినా.. వెళ్లినా కరోనా బారిన పడుతున్నారు. రాజమౌళి తో మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. ఇప్పటివరకూ చాలా మంది సీలెబ్రిటీస్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ప్లాస్మా దానం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు.

రాజమౌళి తన కథతోనే సమాధానం ఇస్తాడు..!
ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ రేంజ్ లో వున్నాయి. ఇక ఈ సినిమాపై చిత్రయూనిట్ చెపుతున్న మాటలు వింటే సినిమాపై ఆ అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇటీవలే బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ యొక్క తమిళ వెర్షన్ డైలాగ్ లు రాసిన మాధన్ కార్కే... బాహుబలి కంటే పది రేట్లు గూజ్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయని.. ఆర్ఆర్ఆర్ ప్రారంభం నుండే అలాంటి సన్నివేశాలు ఉంటాయని చెప్పాడు. ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవన్ ఇద్దరికి ఒకే నిడివి ఉంటుందని.. అదిరిపోయే డైలాగ్స్…
అందరి కన్ను రాజమౌళి షూటింగ్ పైనే..!
లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ లు కూడా మొదలవనున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అనుమతులు అయితే తెచ్చుకున్నారు కానీ ఇప్పట్లో షూటింగ్ లు మొదలు పెట్టడానికి మాత్రం కాస్త ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ పలు నిబంధనలు పెట్టడమే దీనికి కారణం. అన్ని నిబంధనలు పాటించి షూటింగ్ చేయాలంటే మరి కష్టమైన పనే కాబట్టి కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది.
థ్యాంక్స్ కేసీఆర్ సర్.. ఇప్పుడు భాద్యత మాపై ఉంది..!
సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇవ్వమని చిరంజీవి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో తక్కువ మంది సిబ్బందితో, ప్రభుత్వ ఇచ్చిన నిబంధనలను పాటిస్తూ సినిమా/టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోడానికి కేసీఆర్ అనుమతినిచ్చారు.

రష్యన్ ఛానల్ లో బాహుబలి 2
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. అంతేకాదు ఇక ఈసినిమా వచ్చిన అవార్డులకు లెక్కే లేదు ఎన్నో అవార్డులను దక్కించుకుంది.. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు.
మహేష్, రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జక్కన్న మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ టాక్.
తప్పదు బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాలి..!
కరోనా వల్ల అన్ని పరిశ్రమల లాగే సినిమా పరిశ్రమకు కూడా బాగానే నష్టం వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా దాదాపు 2వేల కోట్ల వరకూ బిజినెస్ ఆగిపోయిందని ఇటీవలే చెప్పిన సంగతి గుర్తుండేవుంటది. లాక్ డౌన్ తీసేసినా కూడా థియేటర్స్ మాత్రం ఇప్పట్లో తెరుచుకునే ఓపిక లేదు. ఈ జూన్ నుండి సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా కూడా థియేటర్ లకు అనుమతి ఇవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా పెండింగ్ లో ఉన్న సినిమాల నిర్మాతలకు మాత్రం నష్టమే.
దేశం ప్రేమించిన చిత్రం - నా జీవితంలో అతిపెద్ద చిత్రం 'బాహుబలి2'
ప్రభాస్ అనే పేరు మర్చిపోయి.. బాహుబలి అని పేరును సంపాదించుకున్నాడంటే ప్రభాస్ దానికి కారణం 'బాహుబలి' సినిమా అని ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి.. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం…

సినిమాకే హైలైట్ గా 'బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్'
మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్ లాక్ డౌన్ టైం ను కూడా బాగానే ఉపయోగించుకుంటుంది. ఒక పక్క రాజమౌళి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశాడు. ఎడిటర్ తమ్మిరాజు ఇంటిలోనే ఎడిటింగ్ పనులు మొదలు పెట్టేసారు. ఇక ఒకపక్క ఆ పనులు జరుగుతుండగా మరో పక్క ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న కీరవాణి కూడా తన పని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. కీరవాణి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం యొక్క బిజియమ్ ను పూర్తి చేసాడట.. సినిమా మొత్తంలో కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బిజియమ్ సినిమా హైలైట్స్ లోనే ఒకటిగా నిలుస్తుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు కీరవాణి…
మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి లాంటి సిరీస్ చేసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదని రుజువు చేశారు. ఇక ఈ ఇద్దరు మరోసారి జత కలిస్తే ఎలా ఉంటుంది. అది ఎప్పుడు నిజమవుతుందో తెలియదు కానీ ఉహించుకోడానికి మాత్రం సూపర్. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఇదే టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే..

స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన
హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై రూపొందిన"HIT" మూవీ 28వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "HIT" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (23 వ తేదీ ) జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ .. "HIT" మూవీ టీజర్, ట్రైలర్ స్టైలిష్ గా ఉన్నాయని, ఈ మూవీ స్నీక్ పీక్ రిలీజ్ చేసినందుకు టీమ్ కు అభినందనలు తెలిపారు.
మంచి టైటిల్ ను మిస్ చేసుకున్న రాజమౌళి..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. మన్యంలోని కాఫీ తోటల్లో వారం రోజుల పాటు క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.